బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రీతి జింటా గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈ తరం ప్రేక్షకులకు ప్రీతి జింటా క్రేజ్ తెలియక పోవచ్చు , కానీ 1990ల్లో ప్రీతి జింటా అంటే తెలియని అభిమాని ఉండేవారు కాదు. ప్రీతి జింటా బాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా నటించింది. ప్రీతి జింటా 1998లో మణిరత్నం దర్శకత్వం వహించిన "దిల్ సే.." చిత్రంతో తన సినీ రంగ ప్రవేశం చేశారు. అదే సంవత్సరం ఆమె "సోల్జర్" చిత్రంలో కూడా నటించారు. ఈ రెండు చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. "క్యా కెహనా" (2000), "దిల్ చాహ్తా హై" (2001), "కల్ హో నా హో" (2003) (ఈ చిత్రానికి ఆమె ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నారు), "వీర్-జారా" (2004), "సలామ్ నమస్తే" (2005) వంటి సూపర్ హిట్
తెలుగులో మహేష్ బాబు, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. తన అందం, ముఖ్యంగా ఆమె చిరునవ్వుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రీతి జింటా వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆమె 2016లో అమెరికన్ వ్యాపారవేత్త జీన్ గుడ్‌ఎనఫ్‌ను వివాహం చేసుకున్నారు. దంపతులకు 2021లో సరోగసీ ద్వారా కవల పిల్లలు జన్మించారు. వీరికి ఒక బాబు (జై) , ఒక పాప (జియా) ఉన్నారు.ప్రస్తుతం ఆమె తన కుటుంబంతో లాస్ ఏంజెలెస్‌లో నివసిస్తున్నారు. అయినప్పటికీ ఆమె బాలీవుడ్‌లో కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు.ప్రీతి జింటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) క్రికెట్ జట్టు పంజాబ్ కింగ్స్‌కు సహ-యజమానిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఈక్రమంలోనే హీరోయిన్ ప్రీతి జింటా పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌ల్లో సందడి చేస్తుంటారు. ప్రీతి జింటా తన జట్టు మ్యాచ్‌లు ఆడుతున్న సమయంలో ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తూ, జట్టును ఉత్సాహపరుస్తూ ఉంటారు.ఈ ఏడాది జరుగుతున్న ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు అదరగొడుతుంది.వరుస మ్యాచ్‌లో విజయం సాధిస్తుంది. దీనిలో భాగంగానే పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సమయంలో ప్రీతి జింటా గ్రౌండ్‌లో సందడి చేశారు.
ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు ఘన విజయం సాధించింది. దీంతో మ్యాచ్ అనంతరం ప్రీతి జింటా గ్రౌండ్‌లో ఉన్న అభిమానులకు పంజాబ్ కింగ్స్ జెర్సీని విసిరేశారు.అయితే, వాటిని అందుకోవడానికి అభిమానులు ఒకరితో ఒకరు పోటీ పడటంతో కొంచెం గందరగోళం నెలకొంది.టీషర్టు కోసం అభిమానులు మైదానంలోనే గొడవకు దిగారు.ఒకరిపైకి ఒకరు పిడిగుద్దులు కూడా కురిపించుకున్నారు.ఈ గొడవను సద్దుమణిగేలా చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ప్రీతి జింటా ఇచ్చే టీషర్టు కోసం అభిమానులు ఇలా ఫైటింగ్‌కు దిగడం హాట్ టాపిక్ అయింది. రూ.100 విలువ చేసే టీషర్టులు కోసం అభిమానులు ఇలా తన్నుకోవడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.