జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన శాసన సభ్యులు కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్.
శనివారం నాగర్ కర్నూలు పట్టణంలోని పాత కలెక్టర్ కార్యాలయం దగ్గర బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నాగర్ కర్నూల్ శాసన సభ్యులు కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్. బాబు జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... "సామాజిక న్యాయం, సమానత్వం కోసం అట్టడుగు వర్గాల తరపున అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా, ఆయనకు నా హృదయపూర్వక నివాళి అర్పిస్తున్నట్లు తెలిపారు. బాబు జగ్జీవన్ రామ్ గారు భారతదేశ రాజకీయాల్లో ఎంతో ప్రభావవంతమైన నాయకుడు మాత్రమే కాకుండా, నిస్వార్థ సేవకు, న్యాయ పోరాటానికి ప్రతీక అని, సామాజిక శ్రేయస్సు కోసం ఆయన చేసిన కృషి, నిస్వార్థంగా కొనసాగించిన ఉద్యమాలు భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయినట్లు, అణగారిన వర్గాల శబ్దంగా, వారికి వేదికగా నిలిచిన వ్యక్తిగా, ఆయన తన జీవితాన్ని న్యాయబద్ధమైన సమాజ నిర్మాణానికి అంకితమిచ్చారని, 1947లో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత, జగ్జీవన్ రామ్ భారత రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ సభలో సభ్యుడైనట్లు తెలిపారు. ఆయన లోక్‌సభ (భారత పార్లమెంటు దిగువ సభ) సభ్యుడిగా పనిచేసి కార్మిక, వ్యవసాయం మరియు రక్షణ మంత్రిత్వ శాఖలను నిర్వహించినట్లు, తన మేధస్సు, దృఢ సంకల్పం, ప్రజల పట్ల నిబద్ధత కారణంగా కేంద్ర మంత్రివర్గంలో దీర్ఘకాలం పాటు సేవలందించిన అరుదైన నాయకుడని వివరించారు.ఈ రోజు, ఆయన జయంతిని పురస్కరించుకుని మనందరం ఆయన ఆశయాలను స్మరించుకుంటూ, సామాజిక సమానత్వం, ఐక్యత, విలువలను పాటించాలని, ఆయన చూపిన మార్గం, ఇచ్చిన సందేశం మనకు నిరంతర స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు.
నాగర్ కర్నూల్ శాసన సభ్యులు కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, మాట్లాడుతూ……… బాబు జగ్జీవన్ రామ్ గారి జీవితం ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకమని పేర్కొన్నారు. "ఆయన ఆశయాలు సమాజాన్ని ముందుకు నడిపించే శక్తిగా నిలిచాయి. అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన ఆయన, న్యాయం మరియు సమానత్వానికి నిలువెత్తు ప్రాతినిధ్యంగా నిలిచారని తెలిపారు. బాబు జగ్జీవన్ రామ్ ఒక సామాజిక ఉద్యమ నాయకుడు మాత్రమే కాక, భారత రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి అని కొనియాడారు. బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను నెరవేర్చే దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
జిల్లా ఎస్పీ జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, మాట్లాడుతూ ………. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గొప్ప సంఘసంస్కర్త, స్వాతంత్ర సమరయోధుడని, ప్రజా ప్రతినిధిగా తనదైన ముద్రను వేశారన్నారు. దళిత వర్గాల్లో ఆయన చేసిన కృషి మరువలేనిదని, భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారని, ఆయనను ఆదర్శంగా యువత ముందుకెళ్లాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ జిల్లా అధికారి పి. వి. శ్రావణ్ కుమార్, షెడ్యూల్ కులాల కార్పొరేషన్ ఈ డి రామ్ లాల్ , ఎ ఎస్ డబ్ల్యూ వో శ్రీకర్ రెడ్డి,దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.